Nara Lokesh Oath Taking as Minister | రాష్ట్ర మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం
ఏపీ మంత్రిగా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం చేశారు.
చంద్రబాబు, పవన్ అనంతరం నారా లోకేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య నారా బ్రాహ్మణి, ఆయన కుమారుడు దేవాన్ష్ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ప్రమాణం అనంతరం లోకేశ్ తన తండ్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇతర ప్రముఖులను ఆప్యాయంగా పలుకరించారు. ఆ తర్వాత తన మామయ్య బాలకృష్ణ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడుతో పాటు ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ వేదికపై ఉన్న వారందరినీ పేరు పేరునా ఆత్మీయంగా పలుకరించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్‌లతో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. దీంతో సభ మొత్తం మార్మోగిపోయింది. అనంతరం మోదీ సూపర్ స్టార్ రజనీ దంపతులకు నమస్కారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బాలకృష్ణ, తమిళనాడు మాజీ సీఎం పనీర్ సెల్వం, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇలా అందరినీ పేరు పేరునా పలుకరించారు.