Nara Lokesh in NDA MLA's Meeting | కూటమిలో సైలెంట్ గా నారా లోకేశ్..

Continues below advertisement

ఈ రోజు విజయవాడలో ఎన్డీయే శానససభ పక్ష ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఇందులో తమ నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. ఐతే.. ఈ సమావేశంలో మాత్రం నారా లోకేశ్ సైలెంట్ గా కనిపించారు. స్టేజీపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, అచ్చెన్నాయుడు కూర్చొన్నారు. చంద్రబాబు తనయుడు..యువగళంతో పాదయాత్ర చేసిన నాయకుడు..టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ కూడా ఆయన స్టేజీపై కూర్చొవచ్చు గానీ, ఆయన కూర్చోలేదు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను ఆప్యాయంగా పలుకరించారు. వారితో మాట్లాడారు. అనంతరం..సమావేశం స్టార్ట్ కాగానే ఇలా వెనకలా కూర్చొన్నారు. ఇప్పుడీ వీడియో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే... టీడీపీలో చంద్రబాబు తరువాత నెంబర్ 2 నారా లోకేశ్. అందులో నో డౌట్, కానీ, ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన తరువాత నారా లోకేశ్ సైలెంట్ అయ్యారు. ప్రచారంలోనూ చంద్రబాబు, పవన్ కల్యాణే హైలైట్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఏర్పాటులోనూ వీరిద్దరే హైలైట్ అవుతున్నారు.దీంతో.. నెం-2గా పవన్ కల్యాణ్ ను ప్రమోట్ చేసే క్రమంలో నారా లోకేశ్ ప్రాధాన్యత తగ్గిస్తున్నారా..? లేదా నారా లోకేశ్ కావాలని తన ప్రాధాన్యత తగ్గించుకుని... కూటమిలో తనో సాధారణ ఎమ్మెల్యేగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారా..? అన్నది అర్థం కావట్లేదు. కొందరు టీడీపీ నేతల ప్రచారం ప్రకారం ఐతే.. ప్రభుత్వంలో చంద్రబాబు తరువాత పవన్ కల్యాణ్ తో నెం-2 కోసం పోటీ పడి.. రెండు పార్టీల కార్యకర్తల్లో అయోమయం పెంచడం కంటే... టీడీపీ పార్టీ బాధ్యతలు పూర్తి స్థాయిలో స్వీకరించి.. పార్టీలో నారా లోకేశ్ నెం-1గా మారే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తద్వారా.. 2029 లో వచ్చే ఎన్నికల వరకు పార్టీ లో లోకేశ్ పట్టు పెంచుకుని.. ఆ ఎన్నికల వేళ టీడీపీలో నెం-1 ఫేస్ గా తనే ఉండేందుకు ఈ పంథా ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola