Chandrababu on Special Chair | NDA ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యేకంగా వేసిన కుర్చీ వద్దన్న చంద్రబాబు

Continues below advertisement

విజయవాడలో జరిగిన NDA శాసనసభా పక్ష సమావేశంలో ఓ ఘటన జరిగింది. వేదికపైకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అప్పటికే అక్కడి చేరుకున్న పవన్ ను ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు..కూర్చోవాలని పవన్ కు సూచించారు. అయితే అక్కడ నిర్వాహకులు చంద్రబాబు కోసం పసుపు రంగు క్లాత్ ఉన్న స్పెషల్ కుర్చీ వేయించారు. పవన్ కళ్యాణ్ ను తన పక్కనే కూర్చోండని చెప్పిన చంద్రబాబు...తనకు వేసిన స్పెషల్ ఛెయిర్ ను నిర్వాహకులకు చెప్పి మార్పించారు.

 

ఎన్డీయే కూటమి సమావేశంలో (NDA Alliance Meeting) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును (Chandrababu) టీడీపీ - జనసేన - బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై ఆశీనులయ్యారు. ఈ వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేయగా ఆయన తిరస్కరించారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీ ఉండాలని భద్రతా సిబ్బందికి చెప్పారు. దీంతో వారు సాధారణ కుర్చీని తెప్పించగా.. దానిపై కూర్చున్నారు. ఇది చంద్రబాబు సంస్కారం అని టీడీపీ నేతలు కొనియాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram