Nara Lokesh In Kuppam: మరికాసేపట్లో మొదలవబోతున్న నారా లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ కుప్పం నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల పార్టీ ఇన్ ఛార్జ్ లు, నాయకులు కుప్పానికి చేరుకున్నారు. మరికాసేపట్లో పాదయాత్ర మొదలుకాబోతున్న నేపథ్యంలో వారందరితో లోకేష్ కీలక అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ అనంతరం లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పానికి చేరుకున్న లోకేష్ కు స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. మధ్యాహ్నం కుప్పం పీఈఎస్ వైద్యకళాశాలలో బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించబోతున్నారు.