Kalki Bhagwan Darsanam Ekam Trust: పునఃప్రారంభమైన కల్కి అమ్మ భగవాన్ దర్శనం
సుమారు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కల్కి అమ్మ భగవాన్ దర్శనం పునఃప్రారంభమైంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరదయ్యపాలెం మండలం బత్తులవల్లంలో తమిళనాడు తూర్పు ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన భక్తులతో ఏకం ఆలయం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది వచ్చినట్టు అంచనా. దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం ఏకం ట్రస్ట్ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.