Nara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

 ఓపెన్ గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సినిమాల సంగతి పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఎందుకు యాక్టివ్ గా లేరు. ఆయనేమన్నా టీడీపీకి శత్రువా కాదే. కోస్తే పసుపు రక్తం. కట్ట కాలే వరకూ మా తాత స్థాపించిన టీడీపీతోనే ఉంటానన్నారు. 2009లో పార్టీ కోసం పచ్చచొక్కా వేసి ప్రచారం కూడా నిర్వహించారు. మరి అలాంటాయన 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎక్కడి కెళ్లి పోయారు. 

   సేమ్ టైమ్ వైసీపీ వాళ్లు జూనియర్ ను ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు. కొడాలి నాని వైసీపీ కాబట్టి..వల్లభనేని వంశీ దోస్త్ కాబట్టా..పోనీ టీడీపీ సీనియర్ నేతలు జూనియర్ ఎన్టీఆర్  గురించి మాట్లాడే మాటలు ఎప్పుడైనా విన్నారా. జూనియర్ ఉన్నా లేకపోయినా పోయేదేముంది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వాళ్ల మాటల్లో ఎప్పుడైనా విన్నారా. కానీ ఒక్కడు మాత్రం అలా అనుకోలేదు. తనకు తెలిసో తెలియకో తన చుట్టూ ఉన్న ఈ కోటరీ ఆలోచనల్లో బయటకు వచ్చేలా నిన్న చేసిన ఓ చర్య తీసుకున్న ఓ చిన్న పాటి మెచ్యూర్ గెస్చర్ లోకేశ్ స్ట్రాటజీ ఏంటీ తన ఐడియాలజీ ఏంటో ప్రొజెక్ట్ చేసింది. ఇదే ఆ వీడియో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola