Nara Lokesh Angry on SI : రాళ్లదాడి చేస్తే నో కేస్...లోకేష్ స్టూల్ వేస్తే కేస్ | ABP Desam
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను స్టూల్ ఎక్కి మాట్లాడనివ్వకుండా చేస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ పై లోకేష్ మండిపడ్డారు. తనపై రాళ్ల దాడి జరిగితే పట్టించుకోని పోలీసులు స్టూల్ వేసుకుని మాట్లాడుతుంటే కేస్ పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.