Nandamuri Balakrishna Hindupur Tour | పుట్టినరోజున హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణ | ABP Desam

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటిసారిగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం లో పర్యటించారు. ముందుగా తన పుట్టినరోజు సందర్భంగా హిందూపురం పట్టణంలోని సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన తన బర్తడే సెలబ్రేషన్స్కు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారిగా అన్న క్యాంటీన్ హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... గత ప్రభుత్వం లో అరాచకాలు పేట్రేగిపోయాయని అందుకే ఈ ఎన్నికల్లో వారికి తగిన శాస్తి జరిగిందన్నారు. రాష్ట్రాన్ని ఒక భయాందోళనకరంగా మార్చేశారని వారి మాట వినకపోతే దాడులు చేయడం లేకపోతే హత్యలు చేసేవారని అంటూ గాటుగా విమర్శించారు.  అలాంటి వారికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. సునామి వచ్చే ముందు నిశ్శబ్దం ఎలా ఉంటుందో ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలు అంతే సైలెంట్ గా ఉండి ఓటు రూపంలో వైఎస్ఆర్సిపి అహాన్ని అంచివేశారన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా నన్ను మూడవసారి గెలిపించాలని హిందూపురం ప్రజలకు రుణపడి ఉండాలని పేర్కొన్నారు. 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హిందూపురాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశానని 2019 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి అన్నదే లేకుండా ఉన్న అభివృద్ధిని కూడా పాడు చేశారన్నారు. ప్రస్తుతం మన ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలనలో అందించడమే తన దయమని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్య వైద్యం రవాణా వ్యవస్థలను ముందు గాడిలో పెడతామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola