Naga Chaitanya Srikakulam Tour | శ్రీకాకుళం లో ఫ్యాన్స్ మీట్ నిర్వహించిన నాగ చైతన్య | ABP Desam

Continues below advertisement

 తండేల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు నాగ చైతన్య. ఆయన హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రూపొందింది తండేల్ సినిమా. శ్రీకాకుళం నుంచి చేపల వేట కోసం వెళ్లిన ఓ మత్స్యకారుడు పాక్ నేవీ చేతికి చిక్కటం..అక్కడి నుంచి జైలులో గడిపిన జీవితం..భారత్ కు ఎలా తిరిగి వచ్చాడనే రియల్ లైఫ్ కథాంశంతో తండేల్ సినిమాను డైరెక్టర్ చందూ మొండేటి తెరక్కెకించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య శ్రీకాకుళంలో ఫ్యాన్స్ మీట్ ను నిర్వహించారు. అభిమానులతో కలిసి ఫోటోలు దిగిన చైతూ..అక్కడ తప్పెటగుళ్లు  కళాకారులను కలిశారు. తప్పెట చేతపట్టుకుని వాళ్లతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు నవయువసామ్రాట్


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా రూపొందుతున్న సినిమా 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సగర్వంగా సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై 'బన్నీ' వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా విడుదలపై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. 

డిసెంబర్ 20న 'తండేల్' విడుదల!
Naga Chaitanya and Sai Pallavi's Thandel worldwide release on December 20th: 'తండేల్' చిత్రాన్ని డిసెంబరు 20న థియేటర్లలోకి తీసుకు రావాలని నాగ చైతన్య, దర్శక నిర్మాతలు చందూ మొండేటి, బన్నీ వాసు భావిస్తున్నారు. అతి త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram