Minister Vangalapudi Anitha Taking Charges | ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వంగలపూడి అనిత | ABP

ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయంలో పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య హోంమంత్రిగా సంతకాలు చేసిన అనిత...ఓ సాధారణ గృహిణిని హోంమంత్రిగా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. దిశా పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామమని మంత్రి అనిత ప్రకటించారు. హోమ్, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత (Vangalapudi Anita) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.  పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలని ఆమె సూచించారు. పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలని, ఖాకీ డ్రెస్‌కు గౌరవం వచ్చేలా పనిచేయాలని ఆమె హితబోధ చేశారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా వరకూ తగ్గిస్తామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని, అక్రమాలకు బలైన వారు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శాంతిభద్రతల నిర్వహణ ఉంటుందన్నారు.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola