Pawan Kalyan: పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారా?.. పోలీసులపై పవన్ ఫైర్

Continues below advertisement

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన రాజమహేంద్రవరంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా రాజమహేంద్రవరంలోని హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్‌ కల్యాణ్‌ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేయనున్నారు. రాజమహేంద్రవరం విమనాశ్రయం చేరుకున్న పవన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ర్యాలీగా బయలుదేరారు. నగరంలోని క్వారీ సెంటర్‌లో పోలీసుల తీరుపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన పర్యటనకు ఆటంకాలు సృష్టించొద్దని హెచ్చరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram