BJP Vishnuvardhan Reddy: తుపాను, వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఘోరవైఫల్యం

తుపాను వరద బాధితులను ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వరద బాధితుల పక్షాన నిలబడు తుందని, వారికి కావలసినటు వంటి నిత్యవసర వస్తువులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి వారికి అందజేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. వరద బాధితులకు నష్ట పరిహారం విషయంలో వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపడం మంచిది కాదన్నారు. రాయలసీమ డిక్లరేషన్ పై బిజెపి పార్టీ కట్టుబడి ఉందని విద్యార్థి యువజన సంఘాలు బిజెపిని తప్పుపట్టడం కరెక్ట్ కాదన్నారు. వైసీపీ నేతల ఇళ్ళ ముందు చేసే ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని అంటున్న విష్ణువర్ధన్ రెడ్డితో ముఖాముఖి..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola