ముఖేష్ అంబానీ జూపార్క్ కోసం కడియం నుంచి విలువైన మొక్కలు
అపర కుబేరుడు ముఖేష్ అంబానీకు మొక్కలన్నా, పచ్చదనం అన్నా అత్యంత ఇష్టం కాగా తాను గుజరాత్‌లో ఎంతో ఇష్టంగా నిర్మిస్తున్న జూ పార్కులో విభిన్న రకాల ప్రఖ్యాత మొక్కలను సేకరించి పెట్టాలన్న ఆలోచనే ప్రపంచంలో అరుదుగా లభించే అత్యంత ఖరీదైన మొక్కలను ఆర్డర్‌పెట్టి మరీ రప్పించుకుని ప్రత్యేక కంటైనర్ల ద్వారా తీసుకెళ్లారు.. పనిలో పనిగా ఆయన నూతనంగా నిర్మించుకున్న గృహంలోకూడా అలంకరించుకునేందుకు మరిన్ని ప్రత్యేకమైన మొక్కలను తీసుకెళ్లినట్లు కడియంలోని గౌతమీ నర్సరీ యజమాని వీరబాబు తెలిపారు. వీటిని ప్రత్యేక కంటైనర్ల ద్వారా గుజరాత్ తరలించినట్లు చెప్పారు..