Mudragada Padmanabham name Change | పవన్ కళ్యాణ్ పై సవాల్ ఓడి..అన్నంత పని చేసిన ముద్రగడ | ABP Desam

 Mudragada Padmanabha Reddy: ముద్రగడ పద్మనాభం పేరు ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయింది. ఆయన పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపై ఆయన్ని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పిలవాలని అందులో పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంతో ముద్రగడ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు గెజిట్ విడుదల చేశారు. 

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. నేతల మధ్య మాట యుద్ధం సాగింది. ఈ క్రమంలోనే పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓడిపోతారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి కూడా ప్రజలు తిరస్కరిస్తారని అప్పట్లో జోస్యం చెప్పారు. 
ఆ విమర్శలతో ఆగిపోని ముద్రగడ... పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. పవన్ గెలిస్తే మాత్రం తన పేరు అప్పటి నుంచి పద్మనాభ రెడ్డిగా పిలవాలని అన్నారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. 

సీన్ కట్ చేస్తే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పవన్ లీడింగ్‌లో ఉన్నప్పటి నుంచి ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు జనసైనికులు. పద్మనాభ రెడ్డి నామకరణ మహోత్సవం అంటూ విమర్శలు చేశారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola