CM Chandrababu Kneel Down At Amaravati Foundation | రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటన | ABP

 రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన చోట సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. శంకుస్థాపన జరిగి నిర్మాణాలు ప్రారంభమైన రాజధాని అమరావతి ప్రాంతం ఇప్పుడు విధ్వంసంగా మారిందని రైతులు చెప్పిన విషయాలతో ఎమోషనల్ అయిన చంద్రబాబు..శంకుస్థాపన జరిగిన చోట మోకాళ్ల మీద పడి నమస్కరించారు. అమరావతి రైతులు చంద్రబాబుకు మంగళహారతులు అందించగా..ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి శిలాఫలకాల దగ్గర చంద్రబాబు మంత్రి నారాయణతో కలిసి ఫోటోలు దిగారు. అంతకు ముందు ముఖ్యమంత్రి గత వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక వద్దకు వెళ్లారు. కూల్చిన తర్వాత ప్రజా వేదిక శిథిలాలను తీయకుండా అలాగే వైసీపీ ప్రభుత్వం వదిలేయగా ఆ శిథిలాలను చంద్రబాబు పరిశీలించారు. అక్కడ నుంచి బయల్దేరి కాన్వాయ్ తో ఉద్దండరాయుని పాలెం వెళ్లారు చంద్రబాబు. రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన చోట సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. శంకుస్థాపన జరిగి నిర్మాణాలు ప్రారంభమైన రాజధాని అమరావతి ప్రాంతం ఇప్పుడు విధ్వంసంగా మారిందని రైతులు చెప్పిన విషయాలతో ఎమోషనల్ అయిన చంద్రబాబు..శంకుస్థాపన జరిగిన చోట మోకాళ్ల మీద పడి నమస్కరించారు. అమరావతి రైతులు చంద్రబాబుకు మంగళహారతులు అందించగా..ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి శిలాఫలకాల దగ్గర చంద్రబాబు మంత్రి నారాయణతో కలిసి ఫోటోలు దిగారు. అంతకు ముందు ముఖ్యమంత్రి గత వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక వద్దకు వెళ్లారు. కూల్చిన తర్వాత ప్రజా వేదిక శిథిలాలను తీయకుండా అలాగే వైసీపీ ప్రభుత్వం వదిలేయగా ఆ శిథిలాలను చంద్రబాబు పరిశీలించారు. అక్కడ నుంచి బయల్దేరి కాన్వాయ్ తో ఉద్దండరాయుని పాలెం వెళ్లారు చంద్రబాబు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola