MP Bharath Heroine Isha Chawla Yuvatha Haritha: విద్యార్థులకు మొక్కల సంరక్షణ బాధ్యతలు
రాజమహేంద్రవరం గనిరాజు జంక్షన్ వద్ద యువత-హరిత కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. హీరోయిన్ ఇషా చావ్లా ముఖ్య అతిథిగా వచ్చారు. హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ కూడా పాల్గొన్నారు. వీరంతా పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. ఒక్కో విద్యార్థికీ ఒక్కో మొక్క సంరక్షణ బాధ్యత అప్పగించినట్టు తెలిపారు.