MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్

ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థుల నామినేషన్లు స్క్రూట్నీ విషయంలో అవకతవకలు జరిగాయని, అధికారులు కూటమి నాయకత్వానికి కొమ్ముకాసేలా ఆర్వో వ్యవహరించారని తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ తనయుడు జీవీ శ్రీరాజ్‌.. తన సోదరుడు, ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధి జీవీ సుందర్‌ పేరును ఆల్ఫాబీటా ఆధారంగా కాకుండా కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా 43 వస్థానంలో పెట్టారని ఆరోపించారు. కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌ నామినేషన్‌ ముందు రిజెక్ట్‌ అయ్యిందని, అయితే ఆ నామినేషన్‌ను మళ్లీ ఎలా స్వీకరించారని ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఓటర్లును ప్రలోభపెట్టేవిధంగా నిభందనలను మీరి కూటమి అభ్యర్ధి వ్యవహరిస్తున్నారని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని వాట్సాప్‌ చాటింగ్‌ను చూపించారు. ఈ పరిస్థితిపై ఈసీకు ఫిర్యాదు చేశామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. జీవీ సుందర్ పోరాటం ఆపరని ఆయనకు మద్దుతుగా మేమున్నామంటూ శ్రీరాజ్ చెబుతున్న పరిస్థితులపై ఏబీపీ దేశం ఫేస్‌టూఫేస్‌..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola