MLC Ashokbabu Got Bail: పూచీకత్తుపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్| ABP Desam
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు విజయవాడ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 గంటల పాటు అశోక్ బాబు తమ అదుపులో ఉంచుకున్న సీఐడీ...శుక్రవారం రాత్రి సీఐడీ కోర్టు న్యాయమూర్తికి సబ్మిట్ చేశారు. అనంతరం 40 వేల రూపాయల పూచీకత్తుపై అశోక్ బాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రాలను సర్వీసులో ఉండగా సమర్పించారని అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేసింది.