MLA Roja : ప్రత్యేకంగా స్టాలిన్ ప్రతిమను పట్టువస్త్రంపై నేసిన శాలువ ను బహుకరించిన రోజా | ABP Desam
Tamilanadu CM Stalin ను నగిరి MLA R .K.Roja దంపతులు కలిసారు. చెన్నైలోని సీఎం కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పట్టు వస్త్రంతో సత్కరించారు.నగిరి చేనేత కార్మికుల చేత ప్రత్యేకంగా స్టాలిన్ ప్రతిమను పట్టువస్త్రంపై నేసిన శాలువను ఆయనకు బహుకరించారు. అనంతరం దాదాపు అర్ధ గంట పాటు ఆంధ్రాలో నివసిస్తున్న తమిళుల సమస్యలపై నగిరి MLA Roja తమిళనాడు సీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక్కొక్క తరగతికి 1000 చొప్పున మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5 వేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న కొసలనగరం పారిశ్రామిక పార్క్ నకు తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి,భారీ వాహనాల ట్రాన్స్పోర్టేషన్ రాకపోకలకు అనువుగా నేడుంబరం - అరక్కోణం రోడ్డు NH 716 నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి తమిళనాడు సీఎం అనుమతులు కోరి ప్రతిపాదనలు పంపామన్నారు.