MLA Pinnelli Ramakrishna Reddy | పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ సెర్చింగ్
ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేత, మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తప్పేలా లేదు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కాగా...రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాల మేరకు పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏపీ, తెలంగాణల్లో వెతుకుతున్నారు. పిన్నెల్లి డ్రైవర్ ను సంగారెడ్డిలో అరెస్ట్ చేసిన పోలీసులు..ఫోన్లు వదిలిపారిపోయిన పిన్నెల్లి సోదరుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే ఆయనపై అనర్హత కూడా తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్న ఈ కేసులో మరిన్న విషయాలు ఈ వీడియోలో.
దేశ వ్యాప్తంగా ఈవీఎంల ధ్వంసం వీడియో వైరల్ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. రాష్ట్ర సీఈవోకు నోటీసులు పంపింది. సాయంత్రం ఐదు గంటలలోపు నిందితులను అరెస్టు చేసి నివేదిక పంపాలని ఆదేశించింది. పిన్నెల్లిని అరెస్టు చేయకపోతే పోలీసు వ్యవస్థ విఫలమైనందన్న తీవ్ర విమర్శలు వస్తాయి. గృహనిర్బంధంలో ఉన్న పిన్నెల్లి పోలీసులకు తెలియకుండానే హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయనపై చర్యలు తీసుకోలేదు. వీడియో విడుదలైన తర్వాతనే అరెస్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.