MLA Pinnelli Ramakrishna Reddy ap election 2024 |నిలదీసిన మహిళను తిట్టిన పిన్నెల్ని రామకృష్ణా రెడ్డి |

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఘటనపై పోలింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యేను ఓ మహిళ నిలదీశారు. ఈ క్రమంలో పిన్నెల్లి ఆమెను తిట్టారు. ప్రశ్నిస్తే తిడతారా..! EVMలపై దాడి చేస్తారా..? ఇదేనా వైసీపీ రాజకీయం అంటూ ప్రతిపక్షాలు ఈ ఘటనను తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేత, మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తప్పేలా లేదు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కాగా...రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాల మేరకు పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏపీ, తెలంగాణల్లో వెతుకుతున్నారు. పిన్నెల్లి డ్రైవర్ ను సంగారెడ్డిలో అరెస్ట్ చేసిన పోలీసులు..ఫోన్లు వదిలిపారిపోయిన పిన్నెల్లి సోదరుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే ఆయనపై అనర్హత కూడా తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్న ఈ కేసులో మరిన్న విషయాలు ఈ వీడియోలో.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola