MLA NallapuReddy: బాధ్యత ఉండక్కర్లేదా...వరదలొస్తే సాయం చేయరా....సినీ హీరోలపై ఎమ్మెల్యే ధ్వజం
వరదకు గురైన ముంపుప్రాంతాలను సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు, నిర్మాతలు డైరెక్టర్స్ అదుకోక పోవడం దారుణం అని అన్నారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. సినీ ఇండస్ట్రీకి ANR NTR గతంలో రెండు కళ్ళు అని గతంలో వరద బాధితులకు సాయం చేసిన వ్యక్తులు అప్పటి హీరోలు అని కొనియాడారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.ఇప్పుడున్న హీరోలుఅభిమానుల అండతో పైకి వచ్చి కోట్లు సంపాదించి అభిమానుల కుటుంబాలను అదుకోక పోవడం దారుణం అని విమర్శించారు. ఇకనైనా సినీ హీరోలు వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.కోవూరు తహశీల్దార్ కార్యాలయం కు వచ్చిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు