ఓ వివాహ కార్యక్రమంలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన అనకాపల్లి ఎమ్మెల్యే
ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే నిత్యం మీటింగ్‌లు, సభలు, పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటారు. అలాంటి ఎమ్మెల్యేకు కాస్త తీరిక దొరకడంతో స్టైల్ మార్చారు. సతీమణితో కలిసి స్టెప్పులేశారు. ఆయనే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఎప్పుడూ తీరిక లేకుండా గడిపే ఆయన తాజాగా తమ కుటుంబంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో అద్భుతంగా డ్యాన్స్ చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.