MLA Dharmana on Govt: ప్రభుత్వంపై మరోసారి ధర్మాన సంచలన వ్యాఖ్యలు | Srikakulam | ABP Desam
శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు... ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆలయాల ఆస్తులు.... ప్రభుత్వానివి కావని వ్యాఖ్యానించారు. కోదండరామ ఆలయ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన.... ఇలా మాట్లాడారు. ఆలయ కార్యకలాపాలపై భక్తులకు నమ్మకం పెరిగేలా కొత్త పాలకవర్గం పనిచేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమానికైనా తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ ఆస్తుల్లో ఆక్రమణల తొలగింపునకు కృషి చేయాలని సూచించారు