Chalo Vijayawada : కృష్ణా జిల్లాలో నేషనల్ హైవేపై వాహనాల చెకింగ్ | ABP Desam
కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద నేషనల్ హైవేపై.... జగ్గయ్యపేట వీఆర్వో సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకున్నారు. అనుమతి లేదని స్పష్టం చేశారు. నందిగామ వద్ద జాతీయ రహదారిపైనా పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులనూ జల్లెడ పడుతున్నారు.