MLA Biyyapu: ఇంగ్లీషు గొప్పతనం ఇదే..అసెంబ్లీలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చమక్కులు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఇంగ్లీషు గొప్పతనం గురించి చెప్పటానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమలా హ్యారిస్ ను ఉదహరించారు బియ్యపు. అంతేకాదు సంక్షేమపథకాల గురించి ఎప్పుడో బీసీ కాలంలోనే గ్రీకు సాహిత్యంలో గొప్పగా చెప్పుకున్నారంటూ...ఆ పేపర్ ను వెతుక్కుంటూ బియ్యపు చేసిన హడావిడికి సభలో ఉన్న స్పీకర్ సహా సభ్యులంతా నవ్వుకున్నారు.