MLA Balakrishna: మౌనదీక్ష చేస్తున్న నందమూరి బాలకృష్ణ | Hindupur | ABP Desam
హిందూపురం జిల్లా కోసం MLA నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు. హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి మౌనదీక్ష చేపట్టారు. పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అంబేడ్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన శిబిరంలో మౌనదీక్షకు కూర్చున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా... పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి బాలకృష్ణ హిందూపురం జిల్లా కావాలని తన వాదన వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మౌనదీక్షకు దిగారు.