MLA Ayyannapatrudu Fires on R&B Officials | నాసిరకం రోడ్లు చూసి చిర్రెత్తిపోయిన అయ్యన్నపాత్రుడు |ABP

AP Latest News: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలోని ఆర్ అండ్ బీ రోడ్డును నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికలకు ముందు హడావిడి చేసి పనులు మొదలు పెట్టి, తరువాత ఎందుకు నిలిపివేసారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కల్వర్టులు కట్టకుండా తారు రోడ్డు  వేయడం ఏంటని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని బెర్మో వేసే సమయంలో 10 టన్నుల బరువు గల రోలర్ తో తొక్కించకుండా కేవలం 3 టన్నుల కెపాసిటీ కలిగిన రోలర్ తో రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కల్వర్టు, బ్రిడ్జిలు కట్టకుండా అర్ధరాత్రి సమయంలో తారు రోడ్డు వేయడమేంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. క్వాలిటీ కంట్రోల్ కి రిపోర్టు ఇవ్వకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఈ రోడ్డుకు బిల్లు మంజూరు చేస్తే ఊరుకునేది లేదని ఆయన అధికారులకు హుకుం జారీ చేశారు. తప్పు చేసిన అధికారులు శిక్ష అనుభవించవలసిందే అని అన్నారు. నర్సీపట్నం అబిడ్ సెంటర్ ప్రధాన రహదారి వెడల్పు పనులపై కూడా ఆయన పరిశీలన చేశారు. ఈ సమయంలో ఆర్ అండ్ బీ, మునిసిపల్ అధికారులను పరుగులు పెట్టించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola