Minister Pawan Kalyan Oath Taking | రాష్ట్రమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం

ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణం చేసిన వెంటనే మంత్రిగా పవన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీ ప్రమాణస్వీకార సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడి.. ఒడుదొడుకులు ఎదుర్కొని పడి లేచిన కెరటంలా తిరిగి సీఎంగా తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ క్షణం ఆయన భార్యకు చెప్పలేని ఆనందం. నా తమ్ముడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడన్న ఆనందం ఆ అన్నకు.. నా భర్త ప్రజల మన్ననలు పొంది రాష్ట్ర నేతగా ఎదిగాడనే ఆనందం ఆ భార్యకు.. మా నాన్న అమాత్యునిగా ప్రమాణం చేశారన్న ఆనందం ఆ బిడ్డలకు. సోదరిని ఆత్మీయంగా ముద్దాడిన అన్న. ప్రమాణం అనంతరం తన అన్న కాళ్లకు నమస్కరించిన తమ్ముడు. ఇవీ చంద్రబాబు ప్రమాణస్వీకారంలో కొన్ని మధుర ఘట్టాలు.. గుర్తుండిపోయే క్షణాలు. అవి ఎవరికి గుర్తుండినా ఉండకపోయినా.. వారికి మాత్రం వారి మనసుల్లో చిరకాలం గుర్తుండిపోతాయి. చరిత్రలో కనివినీ ఎరుగని ఘన విజయంతో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో ఇక అభివృద్ధి వైపు పరుగులు పెట్టడమే మిగిలింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola