బీజేపి ప్రజాగ్రహ సభ ఎందుకు పెడుతున్నారో చెప్పాలంటున్న మంత్రి బోత్సా
Continues below advertisement
ప్రజాగ్రహ సభ పేరుతో విజయవాడ లో బీజేపి తలపెట్టిన సభ పై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.అసలు ఎపీలో బీజేపి లేదని మంత్రి బోత్సా సత్యనారాయణ అన్నారు...రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకొనేందుకే బీజేపీ నేతలు సభ నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి మన రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ లేదన్నారు. మూడేళ్ల తరువాత ఇప్పుడు ఎదుకు సభ నిర్వహిస్తున్నారో తెలపాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కంటే మన రాష్ట్రం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందంజలో ఉందని, మనకి వచ్చిన ర్యాంకులే చెబుతున్నాయన్నారు. బిజెపి ఒక రాజకీయ పార్టీగా సభ ఏర్పాటు చేసుకోవచ్చుగాని దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు..
Continues below advertisement