Manthena Ashram Drowned in Flood water| విజయవాడ వరదల్లో నీట మునిగిన మంతెన ఆశ్రమం | ABP Desam

 భారీ వర్షాల కారణంగా విజయవాడలో కరకట్టకు సమీపంలో ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నీట మునిగింది. ఆదివారం రాత్రి నుంచే ఆశ్రమంలోకి నీళ్లు వచ్చాయి. సోమవారం ఉదయానికి కూడా ప్రవాహం తగ్గకపోవడంతో ఆశ్రమం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది.అందులో చికిత్స పొందుతున్న వాళ్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో.. ఇలా తాళ్ల సాయంతో ఆశ్రమం లోపల ఉన్న వారిని బయటికి పంపించారు.ఈ పరిస్థితితో ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. కరకట్ట చుట్టు ఉన్న ప్రాంతాలు నీట మునగడంతో అక్కడ ఉంటున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. 

పక్క రాష్ట్రమైన తెలంగాణలోనూ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీని కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 మంది చనిపోయినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బాధితుల్లో సీఎం భరోసా నింపుతున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola