Man Set MPO on Fire In Karimnagar: పిచికారి మెషీన్ తో పెట్రోల్ చల్లాడు | ABP Desam
Continues below advertisement
కరీంనగర్ జిల్లా తుంగూర్ గ్రామానికి చెందిన తిరుపతి -గంగాధర్ మధ్య గత సంవత్సరం నుండి దారి వివాదం కొనసాగుతోంది. ఈ మేరకు వాళ్లు రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టారు. వాటిని తొలగించేందుకు వెళ్లిన ఎస్సై, తహశీల్దార్, ఎంపీవోపై దాడి జరిగింది. అధికారులపై పిచికారి మెషీన్ తో పెట్రోల్ చల్లి నిప్పంటించాడు ఓ యువకుడు. ఘటనలో ఎంపీవోకు గాయాలు కాగా జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
Continues below advertisement