NDRF కానిస్టేబుల్ శ్రీనివాసులుకు తుది వీడ్కోలు.. జనసంద్రమైన కందిశ గ్రామం
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగులో వరదల్లో విపత్తు నిర్వహణ విధుల్లో కన్నుమూసిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కందిశ గ్రామానికి భౌతిక కాయాన్ని తరలించగా...పోలీసులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. విజయనగరం జిల్లా ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ లో ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు...విపత్తు నిర్వహణలో భాగంగా నెల్లూరు జిల్లా వరదల్లో చిక్కుకుని కన్నుమూశారు. భారీగా తరలివచ్చిన గ్రామస్థుల మధ్య పాలకొండ డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో అంతిమయాత్రను నిర్వహించారు.