Srisailam Temple: భక్తుల క్యూలైన్ మీదకు దూసుకు వచ్చిన విజయ పాల డెయిరీ లారీ
Continues below advertisement
శ్రీశైలం ఆలయం వద్ద భక్తులకు తప్పిన పెను ప్రమాదం. ఆలయ దక్షిణ మాడ వీధి నుంచి ఉచిత దర్శనం క్యూలైన్ మీదకు దూసుకువచ్చిన విజయ పాల డెయిరీ లారీ, పాల లారీ బ్రేకులు ఫెయిలై క్యూలైన్ల వద్దకు వస్తుండడంతో భక్తులు పెద్దఎత్తున కేకలు వేయడంతో వెంటనే దేవస్థానం సిబ్బంది, సెక్యురిటీ గార్డులు, అప్రమత్తమయ్యారు. పెద్ద పెద్ద బండరాళ్లు తెచ్చి లారీకి అడ్డుగా పెట్టి లారీని ప్రమాదం జరగకుండా ఆపడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.
Continues below advertisement