MLA Chevireddy : తిరుపతి గ్రామీణ పరిధి రాయలచెరువుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి పూజలు
Continues below advertisement
తిరుపతి గ్రామీణ పరిధి రాయలచెరువు వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయల చెరువు అరికట్టిన లీకేజీ ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కట్టపైన ఉన్న రాయలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజుల క్రితం భారీవర్షాలకు రాయలచెరువు పూర్తిగా నిండిపోగా చెరువు కట్ట బలహీనపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కట్ట తెగిపోతుందేమోననే భయంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురికాగా....ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో ఎమ్మెల్యే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement