Kurnool Students: రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని కర్నూలులో విద్యార్థి సంఘాల ఆందోళన
రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు రాజధాని విషయంలో అలసత్వం వహిస్తున్నారని అందరూ కలిసికట్టుగా రాజధాని ఏర్పాటుకు కృషి చేయాలని లేనిపక్షంలో వారి కార్యాలయాలు ఇల్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా కళ్ళకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ప్రదర్శన చేశారు.