గిట్టుబాటు లేక కర్నూలు జిల్లా లో పంటకు నిప్పు పెట్టిన అరటి రైతులు.

Continues below advertisement

ఆరుగాలం శ్రమించి విపత్తుల నుంచి అరటి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించ లేదనే చందంగా మారింది కర్నూలు జిల్లా రైతుల పరిస్థితి. జిల్లాలోని నంద్యాల డివిజన్ పరిధిలో గల మహానంది, చాగలమర్రి, రుద్రవరం, డోన్, ప్యాపిలి, ఓర్వకల్లు మండలాల్లో వేల ఎకరాల్లో రైతులు అరటిని సాగు చేశారు. ఒక్క మహానంది మండలంలోనే మూడు వేల హెక్టార్లలో రైతులు అరటి తోటలు వేశారు. ఎకరాకు 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు చేశారు. ఇక కౌలు రైతులకు అయితే ఎకరాకు అరవై వేల కౌలు.. పెట్టుబడి ఖర్చు అరవై వేల అవుతుంది. ప్రకృతి  విపత్తులు వల్ల ఖర్చులు మరింత పెరిగాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram