Kid Crying Outside Jail In Kurnool: జైల్లో అమ్మ, బయట గేటు వద్ద చిన్నారి రోదన

కర్నూలులో హృదయాలను చెమర్చే ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కనిపిస్తున్న ఏడేళ్ల చిన్నారి... అమ్మను చూడాలని వెక్కి వెక్కి ఏడుస్తోంది. కానీ ఆమె తల్లి లోపల జైలు శిక్ష అనుభవిస్తోంది. కర్నూలులోని మహిళా సబ్ జైలు వద్ద కనిపించిన దృశ్యం ఇది. ఆ పాప తల్లి చోరీ కేసులో పట్టుబడితే, పోలీసులు రిమాండ్ కు తరలించారు. సబ్ జైలులో ఉంచారు. తల్లి ఏం చేసిందో తెలియని చిన్నారి, అమ్మను వెతుక్కుంటూ జైలు దాకా వచ్చింది. జైలు తలుపులు కొడుతూ అక్కడే వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. జైలు అధికారులు ఆమెను చూసి, లోపల తన తల్లి వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి బంధువుల ద్వారా ఇంటికి పంపించేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola