Uranium :యురేనియం ప్రాజెక్టులో బ్లాస్టింగ్ వల్ల తుమ్మల పల్లి గ్రామంలో ఇళ్లు బీటలు
Continues below advertisement
కడప జిల్లా వేముల మండలంలో నెలకొన్న యురేనియం ప్రాజెక్టు బాధిత గ్రామాలైన ఎం. తుమ్మల పల్లే, మబ్బు చింతల పల్లే గ్రామాల్లో భూమి కుంగిపోతోంది. తుమ్మలపల్లి గ్రామంలోని పొలాల్లో వెంకట రాములు అనే వ్యక్తి పొలంలో భూమి మూడు చోట్ల గుంతలు పడ్డాయి. దాదాపుగా పది అడుగుల పైన లోతు గుంతలు పడడంతో పంట సాగు చేసుకోవాలన్న భయం వేస్తోందని రైతు వెంకట రాములు చెబుతున్నాడు. అలాగే మరో ఇద్దరు రైతులకు సంబంధించి పొలాల్లో పొలం కుంగిపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇదంతా తుమ్మలపల్లి గ్రామానికి అతి సమీపంలోనే యురేనియం ప్రాజెక్టు భూగర్భ తవ్వకాలు చేయడం వల్లే ఇలా గుంతలు పడుతోందని వారు అంటున్నారు.
Continues below advertisement