Classroom Rooftop Fell on Students In Gonegandla: ఇద్దరు విద్యార్థులకు గాయాలు| ABP DESAM
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలకేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండల ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలలో, స్కూల్ పైకప్పు పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. రెండో తరగతి చదువుతున్న విద్యార్థులంతా క్లాస్ రూంలో ఉండగా ఒక్కసారిగా సీలింగ్ పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో సఫాన్, ఆరిఫ్ అనే పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Tags :
Kurnool News Andhra Pradesh News Gonegandla School Accident Schoold Rooftop Collapsed Students Injured In Gonegandla