ఏపీలో కాకరేపుతున్న ఎంపీపీల ఎన్నిక
అధికార వైసీపీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు, పార్టీ అధినేతలకు ఎంపీపీ ఎన్నిక తలనొప్పిగా మారింది. ప్రకాశం జిల్లాలో 53 ఎంపీపీ పదవుల కోసం వైసీపీలో తీవ్రపోటీ నెలకొంది. ఎంపీపీ పదవుల కోసం యుద్దనపూడిలో క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. ముండ్లమూరు మండలం ఎంపీపీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కర్నూలు జిల్లా కోడుమూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి సెగలు రాజుకున్నాయి. అనంతపురం జిల్లాలోనూ ఎన్నికల్లో అధికార వైసీపీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. దీంతో ఎంపీపీ పదవుల కోసం వైసీపీలో వివాదం తలెత్తింది.