కాకినాడ జీఎంఆర్‌ పవర్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో ఉన్న జీఎంఆర్ పవర్ ప్లాంట్ వద్ద శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి... దట్టమైన పొగ వ్యాపిస్తుంది. అయితే ఈ పవర్‌ ప్లాంట్‌ కొన్నేళ్లుగా పని చేయడం లేదు. దీంతో ప్లాంట్‌లో ఎవరూ లేరు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola