Kurnool: మున్సిపల్ కార్పొరేషన్ నుండి జ్యూడిషియల్ క్యాపిటల్ గా మార్పుకు సిఎం కృషి..!
Continues below advertisement
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ను జ్యుడిషియల్ క్యాపిటల్ గా మార్చేందుకు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కర్నూలు మేయర్ బి.వై.రామయ్య, ఎమ్మెల్యేలు హాఫిజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హల్ ను ఎమ్మెల్యేలు హాఫిజ్ ఖాన్ కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బి వై రామయ్య ప్రారంభించారు. గత ప్రభుత్వం లో కార్పోరేషన్ సమావేశానికి హాల్ కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని వారు మండిపడ్డారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తాము కృషి చేసి, రాష్ట్రంలో మంచి పేరు తీసుకోస్తామన్నారు.
Continues below advertisement