KTR About Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడిన కేటీఆర్ | ABP Desam

Continues below advertisement

సింగరేణి గనుల వేలం పాట గురించి కేటీఆర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. 16 ఎంపీల పవర్‌తో టీడీపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ను ఆపితే, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని వేలం వేయాలనుకుంటున్నాయని అన్నారు. బీఆర్ఎస్‌కు పదహారు సీట్లు వస్తే ఏం చేసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల సమయంలో మాట్లాడారని ఇప్పుడు  ఏపీలో టీడీపీ పార్టీకి 16ఎంపీ సీట్లు వచ్చాయని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగిందని అన్నారు. తెలంగాణ  భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సింగరేణి పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఒక ర‌క్ష‌ణ క‌వ‌చం, శ్రీరామ‌ర‌క్ష అని కేసీఆర్ ఈ 25 ఏండ్ల‌లో ఒక్క‌సారి కాదు వేల సార్లు చెప్పారని గుర్తు చేశారు.  కానీ ఇవాళ ఏం జ‌రిగిందని ప్రశ్నించారు.  కేసీఆర్ 16 పార్ల‌మెంట్ సీట్లు ఇవ్వండి అని మొత్తుకున్నారు ..కేంద్రంలో నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌లో ఉంటామ‌ని చెప్పారు. 16 ఎంపీల‌తో ఏం చేస్తార‌ని సీఎం రేవంత్ రెడ్డితో స‌హా చాలా మంది చాలా మాట్లాడారన్నారు.  కానీ ఇవాళ ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌లో ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ ఆగిపోయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram