తూర్పుగోదావరి జిల్లా ను కమ్ముకున్న మంచు తెరలు
తూర్పుగోదావరి జిల్లాలో మంచు తెరలు కమ్ముకుంటున్నాయి.. జిల్లా వ్యాప్తంగా చలిగాలులు విపరీతంగా పెరగడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పడిపోయాయి.. రాత్రి వేళల్లో మంచు విపరీతంగా కురుస్తోంది.. ఉదయం 7 గంటల వరకు మంచు తెరలు తొలగడం లేదు. ఈ నేపథ్యంలోనే కోనసీమలో మంచుదుప్పటి 8 గంటల వరకు తొలగిపోవడం కనిపించింది..