భవిష్యత్ కార్యచరణ కు సిద్దం అవుతున్న ఎగ్జిబిటర్లు
ఎపీలో సినిమా వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వాతావరణం నెలకొంది.కరోనా పరిస్దితులు తరువాత ధియేటర్ల నిర్వాహణ భారంగా మారటంతో ఆర్దిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఎగ్జిబిటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.మరో వైపున ప్రభుత్వం జీవో 35 ద్వార నిబందనలు కఠినంగా అమలు చేయాలని భావించింది.అయితే దీని పై హైకోర్టు స్టే ఇచ్చింది.దీంతో ప్రభుత్వాన్ని ఎగ్జిబిటర్లు సవాల్ చేసే పరిస్దితులు వచ్చాయి.ఇదే సందర్బంలో ప్రభుత్వం 142 జీవో ను తీసుకువచ్చి,ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వార టిక్కెట్లను విక్రయించాలని భావిస్తోంది.ఈ మెత్తం వ్యవహరం పై ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు శుక్రవారం విజయవాడలో సమావేశం నిర్వహించేందుకు సన్నద్దం అవుతున్నారు.తమ సమస్యలను సీఎం వద్దే తేల్చుకుంటామని అంటున్నారు..