Kolusu Parthasarathy About Land Titling Act | ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన

Continues below advertisement

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్... ఈ చట్టం పేరు చెప్పగానే భూ యజమానులు పిడుగుపడ్డట్లుగా భయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కేంద్రం తెచ్చిన చట్టంలో జగన్ ప్రభుత్వం మార్పులు చేసిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఎన్డీయే సర్కార్ తెచ్చిన చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అమల్లోకి తేవడంతో సన్న, చిన్నకారు రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. పాస్ బుక్ లపై జగన్ ఫొటో పెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కేంద్రం తెచ్చిన చట్టంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంటే, దానికి బదులుగా ఎవరైనా వ్యక్తి అని జగన్ సర్కార్ మార్చింది. ఏదైనా వివాదం తలెత్తితే ఎక్కడ అప్పీల్ చేసుకోవాలో కూడా చెప్పలేదు. దీనిపై ప్రజలు హైకోర్టును ఆశ్రయించాలని వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా చేయడం సాధ్యమైనా అని కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. దోపిడీ చేసేందుకు వైసీపీ అమలు చేసిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సైతం భూయజమానుల వద్ద ఉండవు అని చెప్పడం వారిలో భయాన్ని పెంచింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram