Vande Bharat for Bhimavaram: భీమవరం రైల్వే ప్రయాణికులకు శుభవార్త

Continues below advertisement

Vande Bharat for Bhimavaram:  భీమవరానికి వందే భారత్ రైలు రానుంది. చాన్నాళ్లుగా భీమవరానికి వందేభారత్ సర్వీసు ఉండాలన్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం...ఈ ఆలోచనలకు తుది రూపునిచ్చింది. ఎప్పటి నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణిస్తుంది. ఈ వీడియోలో చూసేయండి.

ప్రస్తుతం తెలంగాణలో మొత్తం నాలుగు వందేభారత్‌ రైళ్లు తిరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య గత ఏడాది సంక్రాంతికి 16 కోచ్‌లతో కూడిన వందేభారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలులో 120 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియో ఉంటోంది. దీంతో ఇటీవల ఇదే రూట్‌లో రెండో వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఈ రైలుకు మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది మార్చి 13 నుంచి సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య తిరుగుతుంది. రెండు రైళ్లు ఒకే రూట్‌లో తిరగటం మొదట కేరళలో మొదలైంది. అంతూ రాదే సికింద్రాబాద్‌ – తిరుపతి, కాచిగూడ – బెంగుళూరు మధ్య మరో రెండు వందే భారత్ సర్వీసులు తిరుగుతున్నాయి. 

రైళ్ల వేగాన్ని గరిష్ట స్థాయికి పెంచుతూ సెమీ హైస్పీడ్‌ రైళ్లుగా వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ ప్రారంభించింది. గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. కానీ ప్రస్తుతం ఈ రైళ్లు సగటున 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 వరకు వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్లు సమాచారం. తొలి రైలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మరో 400 వందేభారత్‌ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram