Kodali Nani House Attacked | గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై దాడి | ABP Desam

కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి పై దాడికి యత్నించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు రువ్వారు, కోడి గుడ్లు విసిరేసి రచ్చరచ్చ చేశారు. అంతటితో ఆగకుండా కొడాలి నాని ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేయగా, తెలుగు తమ్ముళ్లను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు యువతను అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొదట కోడిగడ్లు విసురుతున్నప్పుడు వారిని అడ్డుకోలేకపోయిన పోలీసులు ఆ తరువాత స్పందించారు. కొడాలి నాని ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన సమయంలో మాత్రం టీడీపీ శ్రేణులను పోలీసులు వారించి అడ్డుకున్నారు. తెలుగు తమ్ముళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతకుముందు కొడాలి నాని ఇంటి ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. జై తెలుగుదేశం, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola