Kethireddy Pedda Reddy House Arrest | తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం | ABP Desam
తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్సార్ సీపీ పార్టీ కార్యకర్తలతో తాడిపత్రిలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి హాజరయేందుకు స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. పెద్ద రెడ్డి రాకపై అప్రమత్తమైన పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. తాడిపత్రిలో నిర్వహిస్తున్న సమావేశానికి పెద్దా రెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్ సీపీ నేతలు హాజరు కావొచ్చని అన్నారు పోలీసులు. పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా ఎందుకు అనుమతించరని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పరిస్థితి ఉద్రిక్తం కావడం పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. వైసీపీ కుటుంబసభ్యుల కోసం త్వరలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడతారని ఆయన పెద్ద కోడలు సాయి హర్షితా రెడ్డి సవాల్ విసిరారు. పెద్దారెడ్డిని అడ్డుకోవాలని చూస్తున్న టీడీపీ నేతలంతా ఆ రోజు వెనక్కి తగ్గాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె.